అనతి కాలంలోనే యువ రైడర్ల మనసు దోచిన రాయల్ ఎన్ఫీల్డ్ ఇప్పుడు సుమారు 5 వేల యూనిట్ల హిమాలయన్ బైక్స్ రీకాల్ ప్రకటించింది. నిబంధనల ప్రకారం శీతాకాలంలో ఈ బైక్స్ బ్రేక్ పని తీరు సరిగ్గా లేదని నివేదించింది. 2017-21 మధ్య తయారు చేసిన 4,891 యూనిట్ల హిమాలయన్ బైక్స్ ను ముందుగానే రీకాల్ చేసింది. ఇందులో భాగంగా డీలర్లు ప్రభావిత వాహనాల ముందు, వెనుక బ్రేక్ కాలిపర్స్ రీప్లేస్ చేస్తారు.