సోషల్ మీడియా దిగ్గజాలైన ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్ లకు మాతృసంస్థ అయిన మెటా మరో కొత్త యాప్ తీసుకురావాలని యోచిస్తోంది. ట్విట్టర్ తరహాలో యూజర్లు టెక్స్ట్ అప్డేట్స్ షేర్ చేసుకునేలా ఓ డీసెంట్రలైజ్డ్ సోషల్ నెట్వర్కింగ్ యాప్ తయారు చేసే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ కొత్త యాప్ అందుబాటులోకి వస్తే ఇన్‌స్టాగ్రామ్ లాగిన్ డీటెయిల్స్ తో రిజిస్టర్ కావొచ్చని తెలుస్తోంది.