ఏపీ వ్యాప్తంగా హెచ్3ఎన్2 వైరస్ పై అవగాహన కల్పిస్తున్నామని డీఎంఈ వినోద్ కుమార్ తెలిపారు. విశాఖలో ఎక్కువగా వైరస్ కనిపిస్తోందని, ముక్కు నుంచి గొంతు వరకు వైరస్ ప్రభావం ఉంటుందని చెప్పారు. ఈ వైరస్ వల్ల చిన్నారులు, వృద్ధులకు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని సూచించారు. జనవరిలో 12, ఫిబ్రవరిలో 9 కేసులు నమోదయ్యాయని, వైద్యుల సలహా మేరకే యాంటీబయోటిక్స్ వాడాలని చెప్పారు.