అవినీతి ఆరోపణలతో మలేసియా మాజీ ప్రధానమంత్రి ముహిద్దీన్ యాసిన్ అరెస్ట్ అయ్యారు. 75 ఏళ్ల యాసిన్ కోర్టు విచారణను ఎదుర్కొంటారని అవినీతి నిరోధక సంస్థ వెల్లడించింది. 2020 మార్చి నుంచి 2021 ఆగస్టు వరకు యాసిన్ మలేసియా ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. తరువాత యాసిన్పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. కానీ ఇవి కేవలం రాజకీయపరంగా చేసే ఆరోపణలు మాత్రమేనని తాను ఎటువంటి అవినీతికి పాల్పడలేదని యాసిన్ చెబుతున్నారు.