వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సోమవారం వరకు ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. అవినాష్ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి శుక్రవారం మరోసారి సీబీఐ విచారణకు హాజరయ్యారు. సీబీఐ తనపై తీవ్రమైన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలంటూ హైకోర్టులో ఆయన పిటిషన్ వేశారు.