పొన్నూరు నియోజకవర్గం పెదకాకాని మండలం గడ్డిపాడు గ్రామానికి చెందిన వీరపనేని మహేష్ కు తుళ్లూరు మండలం అనంతవరానికి చెందిన నవ్యతో నాలుగు నెలల క్రితం వివాహమయ్యింది. ప్రస్తుతం నవ్య 3 నెలల గర్భిణి. గురువారం సాయంత్రం మహేష్ మరదలు ఇంటికి వచ్చి గదిలో నిద్రిస్తున్న నవ్యను కేకలు వేసింది ఎప్పటికీ తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చి చుట్టుప్రక్కల వారిని పిలిచి తలుపులు పగలకొట్టి చూడగా అప్పటికే నవ్య ఉరివేసుకొని వేలాడుతూ కనిపించింది. నవ్య మృతి సమాచారం అందుకున్న తండ్రి శానం విజయేందర్రావు పెదకాకాని పోలీస్ స్టేషన్లో తన కూతుర్ని భర్త మహేష్ చంపేశాడని ఫిర్యాదు చేశాడు. అనుమానాస్పద కేసు గా నమోదు చేసి దర్యాప్తు చేస్తామని సీఐ బండారు సురేష్ బాబు తెలిపారు.