ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ శ్రీ కేసలి అప్పారావు రామభద్రపురం మండలంలో గల కేజీబీవి నుశుక్రవారం సందర్శన చేసి పరిశీలన చేశారు. పదవ తరగతి మరియు ఇంటర్ విద్యార్థులుతో మాట్లాడి పరీక్షల్లో ఒత్తిడి లేకుండా ప్రణాళికా బద్దంగా చదువుకొని విజయం సాధించాలని సూచించారు. ఆరోగ్యము, ఆహారము విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ బాలలు తో పనిచేసే వసతి గృహం సిబ్బంది అంకిత భావంతో పనిచేయాలని, తరుచుగా వైద్య పరీక్షలు నిర్వహించాలని, ఇతరులు అనుమతి లేకుండా కేంద్రంలోకి రాకుండా చూడాలని సూచించారు. గ్రామ స్థాయి సచివాలయం మహిళా పోలీస్ సిబ్బంది తరుచుగా కేంద్రాన్ని పర్యవేక్షణ చేయాలని, పోలీస్ సిబ్బంది పెట్రోలింగ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సీసీ కెమెరాలు తప్పని సరిగా ఎల్ల వేళలా పనిచేయాలని, ఫిర్యాదులు పెట్టేను అందుబాటులో ఉంచాలని తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు సమక్షంలో తెరిచి రికార్డ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో కేజీ బీవి ప్రిన్సిపల్ మీసాల దీప మహిళా పోలీస్ ఆర్. లావణ్య మరియు సిబ్బంది పాల్గొన్నారు.