దేశవ్యాప్తంగా ఇంధనానికి డిమాండ్ పెరుగుతోంది. గత నెల 5 శాతం పెరిగి రోజుకు 4.82 మిలియన్ బ్యారెల్స్ (18.5 మిలియన్ టన్నులు) చొప్పున చమురు వినియోగం నమోదైంది. 24 ఏళ్లలో ఈ స్థాయి డిమాండ్ రావడం ఇదే తొలిసారి. గతేడాదితో పోలిస్తే పెట్రోల్ వినియోగం 8.9 శాతం పెరిగి ఫిబ్రవరిలో 2.8 మిలియన్ టన్నులకు చేరింది. డీజిల్ వినియోగం 7.5 శాతం పెరిగి 6.98 మిలియన్ టన్నులకు చేరింది.