వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిగ్రీలో కొత్తగా సైబర్ సెక్యూరిటీ కోర్సును ప్రవేశ పెట్టాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. సైబర్ నేరాలపై అవగాహన, సైబర్ మోసాలు అరికట్టే విధానాలపై ఉస్మానియా, నల్సార్ వర్శిటీ నిపుణులు ఈ కోర్సు రూపొందించారు. అలాగే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ను మేజర్ సబ్జెక్టుగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ను మైనర్ సబ్జెక్టులుగా నిర్వహించనున్నారు.