వేసవిలో గుండె ఆరోగ్యాన్ని మరింత జాగ్రత్తగా కాపాడుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అధిక ఉప్పు తగ్గించాలని, తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలని సూచిస్తున్నారు. పుచ్చకాయను తీసుకుంటే గుండెపై ఒత్తిడి తగ్గిస్తుంది. బొప్పాయిలోని విటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయం చేసి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందంటున్నారు. అలాగే, స్ట్రాబెర్రీ, గోజీ బెర్రీలు వంటివి తీసుకోవాలంటున్నారు.