వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ కోర్సులకు ఏపీ ప్రభుత్వం ఎంసెట్ తప్పనిసరి చేసింది. ఈ మేరకు వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలో 250 నర్సింగ్ కాలేజీల్లో 9,980 సీట్లు అందుబాటులో ఉన్నాయి. జనరల్ కేటగిరీలో 50 శాతం, ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 40 శాతం, ఓసీ జనరల్ వికలాంగులకు 45 శాతం, ఎస్సీ/ఎస్టీ/బీసీ కేటగిరీ వికలాంగులకు 40 పర్సంటైల్ ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొంది.