వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేసిందని మంత్రి కాకాని తెలియజేసారు. రూ.41,436 కోట్ల రూపాయలతో ఏపీ వ్యవసాయ, అనుబంధ రంగాల బడ్జెట్‌ను వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రైతు భరోసా కేంద్రాల వద్ద బ్యాంకింగ్ సదుపాయాలు కల్పిస్తున్నామని కాకాణి అన్నారు. రైతుల ఆదాయం పెంచే విధంగా ఆర్భీకే సేవలు అందిస్తున్నాయి. రైతులకు కావాల్సిన అన్ని సేవలను గ్రామస్థాయిలోనే అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. 8,837 ఆర్బీకే భవనాలు వివిధ స్థాయిలో ఉన్నాయి. ఆర్‌బీకేలను మరింత పటిష్టం చేసేందుకు కృషి చేస్తున్నాం యూట్యూబ్ ఛానళ్లు, మాస పత్రికను ప్రారంభించామని మంత్రి కాకాణి తెలిపారు.