ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీరామాయాణ మహాక్రతువుకు అంకురార్పణ

Bhakthi |  Suryaa Desk  | Published : Thu, Mar 23, 2023, 07:06 AM

దక్షిణ అయోధ్య భద్రాచలంలో వసంతపక్ష పుష్కరోత్సవాల్లో భాగంగా వసంతపక్ష తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టడంతో పాటు శ్రీరామాయణ మహాక్రతువుకు సంప్రదాయబద్ధంగా అంకురార్పణ చేశారు. బుధవారం తొలుత సీతారామచంద్ర లక్ష్మణ స్వామి మూలమూరుల సన్నిధిలో ఉత్సవానుజ్ఞ తీసుకుని. ఉత్సవమూర్తులను చిత్రకూట మండపంవద్దకు తీసుకొచ్చి నవకలశాలతో ఉత్సవాంగ స్నపనం నిర్వహించారు. అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విక్‌గ్వరణంతో పాటు శ్రీమద్రారామాయణ పారాయణదారులు, ఆచార్య బ్రహ్మ, రుత్వికులకు దీక్షా వస్త్ర స్వీకరణ, రక్షాబంధనాలను నిర్వహించారు.


యాగశాల వద్ద దేవస్థానం అధర్వ వేద పండితులు గుదిమెళ్ల మురళీకృష్ణమా చార్యులు ఓంకార ధ్వజారోహణాన్ని ఎగురవేశారు. అనంతరం శ్రీ సీతారామ చంద్రస్వామిని చిత్రకూట మండపం లోకి తీసుకొచ్చి షోడశోపాచారాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సామూహిక సంక్షేప రామాయణ పారాయణం జరిపి హారతి సమర్పించి, తిరిగి ఆలయానికి తీసుకెళ్లారు. సాయంత్రం గోవిందరాజస్వామి ఆలయం (తాతగుడి)లో సీతారామచంద్రస్వామి ఉత్సవమూర్తులను మృత్సంగ్రహణం భక్తిప్రపత్తులతో నిర్వహించారు. ఈ సమయంలో మూడు భాగాలుగా మట్టిని సేకరించి రెండు యాగశాలలతో పాటు కల్యాణ అంకురార్పణకు మరో భాగాన్ని వినియోగించారు. రాత్రి యాగశాల వద్ద శ్రీరామాయణ మహాక్రతువుకు అంకురార్పణం చేసి ప్రసాద వినియోగం చేశారు. ఈకార్యక్రమాలతో భద్రగిరి క్షేత్రం ఆధ్యాత్మిక శోభితంగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com