తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి జరగనున్నాయి. పరీక్ష రాసే విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 4,94,620 మంది టెన్త్ పరీక్షలకు హాజరవుతారని చెప్పారు. పరీక్షా కేంద్రాల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, విద్యార్థులకు తమ స్కూళ్లకు సమీపంలోనే పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.