ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ ముందు నానా హంగామా సృష్టించిన ఘటన ఏపీలోని కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. పత్తికొండ పోలీస్ స్టేషన్ ముందు ఓ వ్యక్తి బీభత్సం సృష్టించాడు. రోడ్డుపై ఆగి ఉన్న ఆర్టీసీ బస్సు అద్దాలను పగలగొట్టాడు. అక్కడ ఆగి ఉన్న కార్లను ధ్వంసం చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లాడు. ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు దాడి చేశాడు అనే వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.