ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్ల కోసం మరో కొత్త ఫీచర్ ను తీసుకురానుంది. 'డిస్ అప్పియరింగ్ మెసేజెస్' ఫీచర్ లో కీలక మార్పులు చేయనుంది. ఈ ఫీచర్ లో ప్రస్తుతం 24 గంటలు, 7 రోజులు, 90 రోజుల టైమ్ ఆప్షన్లు ఉన్నాయి. కాగా, ఈ ఫీచర్ లో మరో 15 ఆప్షన్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వాట్సాప్ తెలిపింది. ఒక గంట నుండి ఒక సంవత్సరం వరకు ఆప్షన్లు వేర్వేరుగా ఉండనున్నాయని సమాచారం.