దేశవ్యాప్తంగా పీఎం శ్రీ (స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) పథకం కింద 9 వేల పాఠశాలలను ఎంపిక చేసినట్లు కేంద్ర విద్యా శాఖ ప్రకటించింది. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి, అధునాతన స్కూల్స్ గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్రం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద ఎంపికైన పాఠశాలలకు మూడేళ్లలో రూ.46 లక్షలు అందిస్తారు. ఏపీ నుంచి 662 పాఠశాలలు ఎంపిక కాగా, త్వరలోనే పథకానికి ఎంపికైన పాఠశాలల జాబితా వెల్లడించనుంది.