రాష్ట్రంలో ప్రజలు ఏ నమ్మకంతో అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పజెప్పారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని వారి అభిమానాన్ని చూరగొనే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన అందిస్తున్నారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. సోమవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 15వ డివిజన్ 72వ సచివాలయం పరిధిలోని శివ శంకర్ రోడ్ నుండి మొదలై కృష్ణవేణి రోడ్, గాయత్రి రోడ్ ప్రాంతాలలో వరకు నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో కలిసి ఇంటింటికి వెళ్లిన అవినాష్ ప్రభుత్వం ద్వారా వారి కుటుంబాలకు అందుతున్న సంక్షేమ లబ్ది వివరాల కరపత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ 15వ డివిజన్ లో గత 12 రోజులుగా గడప గడపకు వెళ్తుంటే ప్రజానీకం బ్రమ్మరధం పడ్తుంటే చాలా ఆనందం గ ఉంది అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ డివిజన్ లో దాదాపు 12కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, ప్రతి ప్రాంతంలో రోడ్లు, సైడ్ డ్రైనేజీ, మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేసి, మౌలిక వసతులు కల్పించడం జరిగిందని అన్నారు.
ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఈ డివిజన్ ను దత్తత తీసుకొంటా అని ఆర్భాటంగా ప్రకటించారని కానీ ఈ డివిజన్ అభివృద్ధి కి చేసింది శున్యం అని, సవతి ప్రేమ చూపించారని విమర్శించారు. గత స్థానిక సంస్థ ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థిని ఓడించడానికి ప్రక్క పార్టీలతో కుమ్మక్కై, బ్యానర్ లు చించి రెచ్చగొట్టే రాజకీయాలు చేసారని కానీ ప్రజలకు వాస్తవాలు తెలుసు కాబట్టే మా అభ్యర్థి బెల్లం దుర్గ ను వెయ్యి ఓట్లు మెజార్టీ తో గెలిపించారని అన్నారు.
ఆ నమ్మకం నిలబెట్టుకొనే విధంగా దుర్గ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు అని అన్నారు. నాడు ఆళ్ళ చల్లారావు కార్పొరేటర్ గా, డిప్యూటీ మేయర్ గా ఈ ప్రాంత అభివృద్ధి కి విశేష కృషి చేశారని, నేడు ఆయన బిడ్డగా దుర్గ కూడా అదేవిధంగా పని చేస్తున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ల చెల్లారావు వైస్సార్సీపీ నాయకులు వెంకటరెడ్డి, బాలాజీ, చిన్న, అబ్బు, రెహమాన్, కలాం, విశ్వనాధ్, బాల తదితరులు పాల్గొన్నారు.