జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేష రాశిలో బుధ గ్రహ సంచారం వల్ల జూన్ 7 వరకూ కొన్ని రాశుల వారు అప్రమత్తంగా ఉండాలని పండితులు పేర్కొంటున్నారు. వృషభ రాశి వారికి వృత్తిలో సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, పనిలో ఆటంకాలు తప్పవు. కన్యా రాశి వారికి అనుకోని ఆపదలు వస్తాయి. మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారికి రుణబాధలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఉండే అవకాశం ఉందంటున్నారు.