మనిషి జీవితంలో అనారోగ్యం, రుగ్మతలు సహజం. అయితే, జన్మరాశుల బట్టి కొన్ని రుగ్మతలు వస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మేష రాశి వారికి తల, ముఖం, మెదడు, మెదడులోని నరాలకు సంబంధించిన సమస్యలొచ్చే అవకాశం ఉందంటున్నారు. వృషభ రాశి వారికి గొంతు, మెడ, నరాలు, ఎముకల సంబంధిత రుగ్మతలు వస్తాయి. మిథున రాశి వారికి భుజాలు, చేతులు, శ్వాసకోశ వ్యాధులొచ్చే అవకాశం ఉంది.