ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడవాలని టిడిపి రాజంపేట సీనియర్ నాయకులు, ప్రముఖ విద్యావేత్త చమర్తి జగన్ రాజు అన్నారు. బుధవారం రాజంపేట నియోజకవర్గ పరిధిలోని వీరబల్లి మండలం దిగువరాచపల్లె పంచాయితీలోని ఎగువ రాచపల్లెలో జరిగిన శ్రీరామ నవమి వేడుకలకు టిడిపి గ్రామ సీనియర్ నాయకులు పద్మరాజు వెంకట్రామరాజు, దిగువరాచపల్లె గ్రామ టిడిపి అధ్యక్షులు ప్రసాద్ రాజు ల ఆహ్వానం మేరకు టిడిపి రాజంపేట సీనియర్ నాయకులు, ప్రముఖ విద్యావేత్త చమర్తి జగన్ రాజు హాజరై సీతారాముల వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమాన్ని జగన్ రాజు ప్రారంభించారు. అదే విధంగా ఆయన గ్రామ దేవత అయిన శ్రీ ఆర్యమాంబ తల్లి ఆలయం వద్దకు వెళ్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈయన వెంట టిడిపి వీరబల్లి మండల అధ్యక్షులు యం. భానుగోపాల్ రాజు, సీనియర్ నాయకులు యర్రపురెడ్డి రెడ్డెప్ప రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, ఆంజనేయులు రెడ్డి, జయచంద్రా రెడ్డి, రామ రాజు, సుదర్శన్ రాజు, కేశవరాజు, జయరామ రాజు, తెలుగుయువత పార్లమెంట్ కార్యదర్శి నేతి రమేష్ బాబు, నందకూమార్ నాయుడు, బీసీ నాయకులు దుర్గం ఆంజనేయులు, సుధాకర్, బండి రమణయ్య, తదితరులు పాల్గొన్నారు.