హనుమాన్ జయంతి రోజు ఉదయాన్నే శుచిగా తయారై ఉపవాసంతో హనుమంతుని పూజిస్తే శుభం జరుగుతుందని భక్తుల నమ్మకం. అయితే, హనుమంతుని పూజలో కొన్ని తప్పులు చేయకూడదని పండితులు చెబుతున్నారు. పూజలో పంచామృతం, చరణామృతం ఉపయోగించకూడదని చెబుతున్నారు. ఈ రోజు మద్యం, మాంసం తీసుకోకూడదని పేర్కొంటున్నారు. శ్రద్ధ, ఏకాగ్రతతో పూజ చేయాలంటున్నారు.