గురు చండాల యోగంతో ధనుస్సు, కన్యా, మిథున, మేష రాశి వారికి కొన్ని ఇబ్బందులు తప్పవని పండితులు చెబుతున్నారు. వీరు ప్రతి సోమవారం శివుని ఆలయానికి వెళ్లి అభిషేకం చేయాలి. శివయ్యకు బిల్వ పత్రాలు సమర్పించి మహా మృత్యుంజయ మంత్రం జపించాలి. ప్రతి గురువారం అరటి చెట్టును పూజించి, పశువులకు తిండి పెట్టాలని సూచిస్తున్నారు. ఇలా చేస్తే పరిహారం జరిగి ప్రతికూల ప్రభావం తగ్గుతుందంటున్నారు.