తేనెతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అయితే, తేనెతో కొన్నింటిని తీసుకోకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తేనె, నెయ్యి సమ భాగాలుగా తీసుకోకూడదు. తేనెను గోరువెచ్చని నీటితో మాత్రమే తీసుకోవాలి. బాగా వేడిగా ఉన్న నీటితో తీసుకోకూడదు. నిమ్మరసాన్ని తేనె, నెయ్యిలతో కలిపి గానీ, మినపప్పు-బెల్లం-నెయ్యితో తీసుకోకూడదంటున్నారు. మాంసం-తేనె తీసుకోకూడదు. అలాగే, వెల్లుల్లి, మునగ, తులసితో పాలు తాగొద్దు.