దక్షిణ కొరియా కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్స్ ఇండియా మరో కొత్త SUVని తీసుకురానున్నట్లు ప్రకటించింది. హ్యుందాయ్ ఎక్స్టర్ పేరుతో ఎంట్రీ లెవల్ ఎస్యూవీని తీసుకురానున్నట్లు శుక్రవారం ప్రకటించింది. హ్యుందాయ్ ఎక్స్టర్ ఎస్యూవీని ప్రకటించినందుకు గర్వంగా ఉందని హ్యుందాయ్ మోటార్స్ సీఓఓ తరుణ్ గార్గ్ తెలిపారు. హ్యుందాయ్ నుంచి వస్తున్న ఎనిమిదో ఎస్యూవీ ఇదన్నారు.