ఉద్యోగుల తొలగింపుపై ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సీఈవో ఆండీ జాస్సీ కీలక వ్యాఖ్యలు చేశారు. సంస్థలో 27 వేల మందిని తొలగించడం కఠినమైన నిర్ణయమని, కానీ తప్పలేదని తెలిపారు. ఖర్చులను నియంత్రించుకునే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. తొలగించిన ఉద్యోగులకు తెగతెంపుల చెల్లింపు, తాత్కాలిక ఆరోగ్య బీమా ప్రయోజనాలు కల్పించామన్నారు. కాగా అమెజాన్‌లో రెండు దఫాలుగా 27 వేల మందిని తొలగించిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa