ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సమన్లు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణలో భాగంగా ఏప్రిల్ 16వ తేదీన విచారణకు రావాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ప్రస్తుతం జైల్లో ఉన్నారు.