ఏపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సెటైర్లు వేశారు. విశాఖలోని రుషికొండ తవ్వకాలపై స్పందించిన పవన్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. రుషికొండను ధ్వంసం చేయడంలో ప్రభుత్వం నిబంధనలు అన్నింటిని ఉల్లంఘించిందని ఐదుగురు సభ్యుల నిపుణుల ప్యానెల్ నిర్ధారించిందని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం దీనికి సమాధానం చెబుతుందా లేక రుషికొండ గ్రీన్ మ్యాట్‌పై 151 అడుగుల స్టిక్కర్‌ను అంటిస్తారా అంటూ ట్వీట్ చేశారు.