దేశంలో ఎక్కువగా పండిస్తున్న తృణధాన్యాల పంటల్లో బార్లీ ఒకటి. సారవంతమైన అన్ని రకాల నేలలు దీనికి అనుకూలంగా ఉంటాయి. ఈ పంట సాగుకు 15 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ వరకూ అనుకూలంగా ఉంటుంది. ఓ హెక్టారు లో సాగు చేయాలంటే దాదాపు 60 కిలోల నుంచి క్వింటా విత్తనాలు అవసరం. విత్తన శుద్ధి చేసి, సేంద్రియ విధానంలో సాగు చేస్తే 80-120 రోజుల్లోనే పంట చేతికొస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.