వేసవిలో భూగర్భ జలాలు అడుగంటి పండ్ల తోటలు పూర్తిగా ఎండిపోతాయి. ఈ క్రమంలో చెట్లపాదుల్లో సేంద్రియ ఎరువు, వర్మీ కంపోస్ట్, ఆముదం, వేప, కానుగపిండి వంటివి వేయాలని నిపుణులు పేర్కొంటున్నారు. వ్యవసాయ వ్యర్థాలైన ఎండిన ఆకులు, వేరుశనగ కాయల పొట్టు వంటివి 4 అంగుళాల ఎత్తు వరకు వేసి మల్చింగ్ చేయాలి. దీని ద్వారా పాదుల నుంచి తేమ తొందరగా ఆరిపోదని అంటున్నారు. బిందు సేద్యం ద్వారా నీటి వృథా అరికట్టొచ్చంటున్నారు.