విశాఖపట్నం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకొని జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు ఆదేశాల మేరకు విశాఖ జిల్లా యస్‌సి సెల్ అధ్యక్షుడు బోని శివరామ కృష్ణ నిర్వహనలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి మాట్లాడుతూ సామాజిక ఆర్థిక రాజకీయ సంస్కర్తగా రాజ్యాంగ నిర్మాతగా భారతదేశ ప్రజల అభ్యున్నతికి ఎంతగానో కృషిచేసిన అంబేద్కర్ సేవలను కొనియాడారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ అణగారిన బహుజన వెనుకబడిన వర్గాల హక్కుల కోసం సమన్యాయం జరిగేలా వారి ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు భారత రాజ్యాంగాన్ని రూపొందించిన మహోన్నత వ్యక్తి అంబేడ్కర్ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు పండుల రవీంద్ర బాబు, వరుదు కళ్యాణీ, శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా పరిషత్ చైర్మన్ జల్లిపల్లి సుభధ్ర, జి సి సి చైర్మన్ శోభా స్వాతీ రాణి, వివిధ కార్పోరేషన్ చైర్మన్లు జాన్‌వెస్లీ, కోలా గురువులు, పిల్లా సుజాత, పిల్లి సుజాత , నియోజకవర్గ పరిశీలకులు శ్రీ ఎస్. ఎ రెహ్మాన్ , సూర్యనారయణ రాజు , రాష్ట్ర కమిషన్ సభ్యులు పక్కి దివాకర్ , బి కాంత్ రావు , జిల్లా వివిధ కార్పొరేషన్ చైర్మన్లు పళ్ళ చిన్నతల్లి , కే. వి బాబా, ఆల్ఫా కృష్ణ , రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, పార్టీ ముఖ్య నాయుకులు ఉడా రవి , అల్లంపల్లి రాజబాబు , ఐ. హెచ్ ఫరూక్ , ద్రోణంరాజు శ్రీవాత్సవ్ , పేర్ల విజయ చంద్ర, నడింపల్లి కృష్ణ రాజు , మొల్లి అప్పారావు, సతీష్ వర్మ, బంగారయ్య , జోనల్ ఇన్‌చార్జులు చొక్కాకుల వెంకట రావు, సునీల్, తుళ్ళి చంద్ర శేఖర్ , మారుతి ప్రసాద్, జిల్లా అనుబంధ అధ్యక్షులు మాన్యాల శ్రీనివాస్, అప్పన్న , బొండా ఉమామహేశ్వరరావు , ఈశ్వర్ రావు , నమ్మి లక్షణ్, కార్పొరేటర్లు బి. పి. ఎన్. కుమార్ , కో ఆప్షన్ సభ్యులు ఎం. డి షరీఫ్ , పార్టీ సీనియర్ నాయకులు బి పద్మావతి , యువ శ్రీ , రాయుడు శ్రీను, మొల్లి చిన్న , అనురాధ, వెంకట లక్ష్మి, శ్రీ దేవివర్మ , ధనలతా , రోజా రాణి , గాయత్రి , చొక్కర శేఖర్ , జార్జ నాని, కడిపల్లి శ్రీధర్ , మధు సంపత్, శ్రీనివాస్ రెడ్డి , విక్టర్, రామా రావు, సింహాచలం , నాయకులు తదితరులు పాల్గొన్నారు.