భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రజలు, ప్రజా సంఘాలు, కుల, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నాయకులు ఊరూరా సంబరాలను అంబరాన్ని తాకేలా జరుపుకున్నారు. శుక్రవారం అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకుని పీలేరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి యుటిఎఫ్ డివిజన్ ఆధ్వర్యంలో నాయకులు సదాశివరెడ్డి, శివారెడ్డి, జి. రాధాకృష్ణ, కృష్ణారెడ్డి, రెడ్డప్ప సైదాన్ సాహెబ్, అంబేద్కర్ కు నివాళులర్పించారు. న్యాయ కోవిదుడు, విశిష్టమైన చరిత్రకారుడు, ఆర్థిక శాస్త్రవేత్త, అద్భుతమైన రచయిత, తిరుగులేని ఉద్యకారుడు, ప్రజలను కట్టి పడేయగల వక్త, ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, మానవతావాది, స్వేచ్ఛా సమానత్వ స్థాపనకోసం తపన పడ్డ, సామాజిక విప్లవకారుడు, స్వాతంత్ర్య భారత తొలి న్యాయశాఖా మంత్రి, రాజ నీతిజ్ఞులు, బోధిసత్వ, మహిళలు, కార్మిక హక్కుల ప్రధాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు. అదే విధంగా పీలేరు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ నరసింహుడు, హెడ్ కానిస్టేబుల్ విజయ్, మణి, రమేష్, స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేసి నమస్కరించారు. అంతేకాకుండా పట్టణంలోని పలువురు ప్రముఖులు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, కార్మిక సంఘాల నాయకులు కూడా అంబేద్కర్ విగ్రహానికి విడివిడిగా తమ తమ సంఘాల నాయకులు, సభ్యులతో కలిసి నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. మాల మహానాడు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక చిత్తూరు రోడ్డులోని అంబేద్కర్ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థుల చేత అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే విద్యార్థులు ఆటపాటలు, నృత్య ప్రదర్శనలతో అందరినీ అలరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ధరణి కుమార్, జిల్లా నాయకులు సుభాష్, మల్లికార్జున, గురుకుల విద్యాలయ ప్రిన్సిపాల్, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.