ప్రస్తుతం వడగాలులు, అధిక ఉష్ణోగ్రతలు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకూ జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు జంక్ ఫుడ్, ప్రై కూరలు తినకుండా తల్లిదండ్రులు జాగ్రత్తపడాలి. శీతల పానీయాలు, ఐస్ క్రీం వంటివి అస్సలు ఇవ్వకూడదు. ఎండలో బయటకు వెళ్లనివ్వొద్దు. ఎక్కువగా నీళ్లు, మజ్జిగ, పుచ్చకాయ, పండ్లు, త్వరగా జీర్ణమయ్యే తేలికపాటి ఆహారం ఇవ్వాలంటున్నారు.