డయాబెటిస్ రోగులు జీవితాంతం టేస్టీ పాయసాలకు దూరంగా ఉండాల్సిందేనా? అవసరం లేదు. కొన్ని పాయసాలు తయారుచేసుకోవచ్చు. స్వీట్ క్రేవింగ్స్ పాయసం కోసం పాలు, కుంకుమ పువ్వు, ఆర్టిఫిషియల్ చక్కెర గుళికలు, బియ్యం, పిస్తాలు, యాలకుల పొడితో టేస్టీ పాయసం తయారు చేసుకోవచ్చు. అలాగే క్యారెట్ పాయసం కోసం ఓట్స్, క్యారెట్ తురుము, నారింజ తొక్క తురుము, తేనె, వెన్న తీయని పాలు, యాలకులు, బాదం పప్పు వేసి తయారు చేసిన పాయసాలను తాగొచ్చు.