అనంతపురం కలెక్టరేట్‌లో సోమవారం స్పందనకు రాప్తాడు మండలం గొందిరెడ్డి పల్లికి చెందిన ఆదినారాయణరెడ్డి, తన చిన్న కుమారుడు రవీంద్రరెడ్డిని వెంటబెట్టుకుని వచ్చారు. టీడీపీ ప్రభుత్వంలో తన ఇద్దరు కొడుకులకు పింఛను వచ్చేదని, ఆ సొమ్ముతో వారి అవసరాలు తీరేవని, వైసీపీ అధికారంలోకి వచ్చాక నాలుగు నెలలకే తన చిన్న కొడుకు పింఛను నిలిపేశారని కలెక్టర్‌ను కలిసి గోడు వెల్లబోసుకున్నారు. కలెక్టరేట్‌కు మూడు సార్లు వచ్చి విన్నవించుకున్నా న్యాయం జరగలేదని వాపోయారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa