సీమ పల్లెల్లో పాదయాత్ర చేస్తూ ప్రజల కష్టాలు చూస్తుంటే చాలా బాధేస్తోందని టీడీపీ నేత నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. పల్లెల్లో రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉందన్నారు. అలాగే గ్రామాల్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని మండిపడ్డారు. ఒక్క ఏడాది సర్పంచ్‌లు ఓపిక పట్టండి.. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని పేర్కొన్నారు. సర్పంచ్‌ల హక్కులను ఈ ప్రభుత్వం పూర్తిగా కాలరాసిందన్నారు. సర్పంచ్‌ల నిధులు పక్కదారి పట్టించిందని లోకేష్ ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే గతంలో మాదిరిగా డైరెక్ట్‌గా సర్పంచ్ అకౌంట్లలోనే నిధులు వేస్తామని హామీ ఇచ్చారు. సర్పంచ్‌ల గౌరవంను టీడీపీ నిలబెడుతుందన్నారు. అలాగే రాజ్యాంగం ఇచ్చిన హక్కులను టీడీపీ కాపాడుతుందని భరోసా ఇచ్చారు.