ఏపీలో ఇంటర్మీడియెట్ పరీక్షా ఫలితాలు ఈ వారమే విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రశ్నపత్రాల మూల్యాంకనం పూర్తయిందున ఫలితాల విడుదలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 29న ఫలితాలు రాబోతున్నాయని విద్యార్థులు, తల్లిదండ్రులకు కళాశాలల యాజమాన్యాలు సమాచారం ఇస్తున్నాయి. అయితే అధికారులు మాత్రం విడుదల తేదీని ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.