మంచి ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ ఉదయాన్ని పోషకాలతో నిండిన బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే, కొంతమందికి ఉదయం టిఫిన్ తిన్న తర్వాత స్నానం చేయడం అలవాటు. అలా చేస్తే శరీర ఉష్ణోగ్రత తగ్గుతుందని, ఆ ప్రభావం జీర్ణవ్యవస్థపై పడుతుందని పేర్కొంటున్నారు. ఫలితంగా వాంతులు, అల్సర్స్, అసిడిటీ, ఊబకాయం వంటి రుగ్మతలు వస్తాయంటున్నారు.