ఒత్తిడి, నిద్రలేమి సమస్యలతో కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. కాఫీ పొడి, తేనె బాగా కలిపి తర్వాత విటమిన్ ఇ క్యాప్సూల్స్ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని కళ్ల కింద సమానంగా అప్లై చేయాలి. తర్వాత 10 నిమిషాలు అలాగే వదిలేయాలి. దీని తర్వాత ముఖాన్ని చల్లని నీటితో కడగాలి. అలా చేస్తే కంటి కింద నల్లటి వలయాలు తగ్గుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. అంతే కాకుండా ఉబ్బిన, అలసిన కంటి సమస్యను సైతం అధిగమించవచ్చంటున్నారు.