ప్రభుత్వ బ్యాంక్‌లు వాటి ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పనిని అనుమతించనున్నాయి. త్వరలో ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేస్తుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ విధానం అమల్లోకి వస్తే 5 రోజుల పనిదినాల్లో ఉద్యోగులు 40 నిమిషాలు అదనంగా పనిచేయాల్సి ఉంటుంది. ఈ పద్ధతిని ఇప్పటికే IBA, UFBE సూత్రప్రాయంగా ఒక అంగీకారానికి వచ్చాయి.