శరీరంలో కొవ్వు పేరుకోకుండా చేయడంలో ఆవాలు ఎంతగానో ఉపయోగపడతాయి. గొంతు నొప్పి, దగ్గు, జలుబు వంటి వాటితో బాధపడుతున్నప్పుడు మరుగుతున్న నీటిలో ఆవాల పొడిని వేసి గోరు వెచ్చగా తాగడం వల్ల ఆ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఆవాలలో ఉండే సెలీనియం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఊపిరితిత్తుల సమస్యలను, వాపులను తగ్గిస్తుంది. వీటిని వంటలల్లో వాడడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.