ఏపీలోని వైఎస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొండాపురం మండలం చిత్రావతి బ్రిడ్జి వద్ద తుఫాన్ వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాద సమయంలో తుఫాన్ లో 11 మంది ఉన్నట్లు సమాచారం. బాధితులు తాడిపత్రికి చెందినవారిగా తెలుస్తోంది. తిరుమలలో దర్శనం చేసుకొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa