తాటి గుజ్జులో అనేక పోషక విలువలు దాగి ఉన్నాయి. ఇందులో మాంసకృత్తులు 3 %, పీచు 1.7 % తో పాటు ఖనిజ లవణాలు 4.4 % ,100 గ్రా.లలో 3.2 మి.గ్రా. బీటా కెరోటిన్‌ను కలిగి ఉంటుంది. వీటితో పాటు ‘‘సి’’ విటమిన్, అనేక పోషక విలువలు సమృద్ధిగా ఉంటాయి. తాటి గుజ్జును చాపల మీద సన్నని పొరలగ వేసి ఎండలో ఆరబెట్టి తాండ్ర తయారు చేస్తారు. తాటి పండును వేడి నీటిలో 10 నిమిషాలు ఉంచడం ద్వారా సులభంగా గుజ్జును వేరు చేయవచ్చు.