సీజన్‌ని బట్టి తినే ఆహార పదార్థాలు మార్చితే ఆరోగ్యంగా ఉంటారు. ఈ వేసవిలో కొన్ని ధాన్యాలు తీసుకుంటే.. శరీరానికి చలువ చేస్తుంది. కొన్ని రకాల చిరుధాన్యాలు ఆరోగ్యానికి చాలా మంచివి. సలాడ్లు, పులావ్, దోసెలు ఇలా చాలా వంటకాల్లో వాటిని వాడొచ్చు. పోషకాలు ఎక్కువగా ఉన్న బార్లీ వేసవిలో మంచి ఆహారం. వేడి వల్ల శరీరం కోల్పోయిన అనేక పోషకాలు బార్లీలో ఉంటాయి. రాగులు, సాములు, జొన్నలు శరీరంలో ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి.