చాలామందికి చిన్నవయసులోనే తెల్ల వెంట్రుకలు వేధిస్తుంటాయి. విటమిన్ల లోపం, జన్యుపరమైన సమస్యలు, ఒత్తడి, ధూమపానం ఇలా అనేకం దీనికి కారణాలు కావచ్చు. అయితే మీ శరీరంలో విటమిన్ B-12 లోపం ఉంటే, మీరు దాని సప్లిమెంట్లను తీసుకోవచ్చు. గుడ్లు, కొవ్వు చేపలు, పాల ఉత్పత్తులు, బ్రోకలీ, పుట్టగొడుగులు వంటి వాటిని తినవచ్చు. అలాగే, జుట్టు నెరసిపోకుండా ఉండటానికి ధూమపానం మానేయడం మంచిది.