భోజనం చేశాక కొన్ని పనులు చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. తిన్న వెంటనే నిద్రపోతే జీర్ణక్రియలో ఇబ్బందులు ఏర్పడతాయంటున్నారు. అలాగే, ధూమపానం వద్దని, స్నానం చేయకూడదని అలా చేస్తే పొట్ట చుట్టూ రక్త ప్రసరణపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు. భోజనం చేసిన వెంటనే పండ్లు తినకూడదని 2 గంటల తర్వాత తీసుకోవాలని చెబుతున్నారు. కొందరు తిన్న వెంటనే టీ తాగుతారని దీని వల్ల ఆహారం జీర్ణ కావడం కష్టమవుతుందని పేర్కొంటున్నారు.