గ్రామ పంచాయతీ కార్యదర్శులకు తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విధులకు హాజరు కావాలని ఆదేశించింది. ఉదయం, మధ్యాహ్నం వారి అటెండెన్స్‌ను నోట్‌కామ్ ద్వారా ఆన్‌లైన్‌లో పంపాలని పేర్కొంది. ఇక రోజూవారి వివరాలను సైతం మధ్యాహ్నం లోపు పంపించాలని తెలిపింది. ఇటీవల గ్రామ పంచాయతీ కార్యదర్శుల సమ్మె అనంతరం కొందరు సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఫిర్యాదులు రావటంతో ఈ చర్యలు తీసుకుంది.