ప్రస్తుత రోజుల్లో రొమ్ము కాన్సర్ సమస్య మహిళల్ని పట్టి పీడిస్తోంది. కొద్దిరకాల కూరగాయల ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాలీఫ్లవర్, బ్రోకలీ, క్యాబేజీ వంటి క్రూసిఫరస్ కూరగాయలు ఎక్కువగా తీసుకుంటే స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని ఎన్నో అధ్యయనాల్లో తేలింది. విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ పుష్కలంగా ఉండే టమాటా ఈ క్యాన్సర్‌తో పోరాడటానికి ఎంతో మేలు చేస్తుంది.