నీళ్లు రెగ్యులర్ గా తాగితే కాళ్ల వాపు తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. గోరువెచ్చని నీటిలో రాళ్ల ఉప్పు, పసుపు వేసి కాళ్లని అందులో ఉంచితే వాపు తగ్గుతుంది. గాయాలున్నప్పుడు మాత్రం ఇలా చెయ్యొద్దు. నిమ్మరసం తాగినా కూడా పాదాల్లో వాపు తగ్గుతుందంటున్నారు. పాసెస్డ్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. ఏదైనా గాయమై వాపు వస్తే ఐస్ ప్యాక్స్, కంప్రెషన్ బ్యాండేజ్ లతో కూడా ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు.