కొన్ని రకాల పండ్ల గురించి ఇప్పటికీ కొందరికి తెలియదు. గోవా, గుజరాత్ లో లభించే కోకుమ్ పండుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ పండు డయేరియా చికిత్సలో వాడతారు. జుట్టు, చర్మం ఆకృతిని మెరుగు పరచడంలో, గాయాలు, అల్సర్లను నయం చేయడంలో సహాయపడుతుంది. కోకుమ్ తింటే రోగ నిరోధక శక్తి పెరగడం సహా స్ట్రోక్, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు.